సాధారణంగా చాలామంది డ్రింక్ తోపాటు తరుచుగా మెనూలోని వారికిష్టమైన స్నాక్స్ తింటారు. అందరూ దాదాపు ఇలానే చేస్తుంటారు.

డ్రింక్స్, ఫుడ్ ని ఆర్డర్ చేసేటప్పుడు మనం పెద్దగా ఆలోచించం. కేవలం రుచి గురించి మాత్రమే ఆలోచిస్తాం.

ఇలా ఆల్కహాల్ తో పాటు తినకూడని ఫుడ్ తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం సమస్యలు వస్తాయి.

రాత్రి పార్టీ చేసుకున్న తర్వాత మీకు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకుంటే.. మేం చెప్పే టిప్స్ ఫాలో అవండి.

వైన్ తీసుకునేటప్పుడు ఆ రాత్రి భోజనంలో బీన్స్ లేదా కాయధాన్యాలు ఉండకుండా చూసుకోండి.

బీన్స్, ధాన్యాల్లో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుంది. వీటితో వైన్ తోపాటు తీసుకుంటే ఆ పదార్థాల్లోని పోషకాలను శరీరం గ్రహించదు.

వైన్ లో టానిన్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఈ ముఖ్యమైన ఖనిజాన్ని గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది.

మీరు బీర్ తోపాటు బ్రెడ్ తినడాన్ని నివారించండి. ఎందుకంటే రెండింటిలో ఈస్ట్ ఉంటుంది.

మీ కడుపులో ఇంత ఎక్కువ మొత్తంలో ఈస్ట్ ఉంటే జీర్ణం కాదు. ఇది జీర్ణ సమస్యలు పెరగుదలకు కారణమవుతుంది.

వైన్ లేదా బీర్ తీసుకునేటప్పుడు సాల్టీ ఫుడ్ ని దూరం పెట్టండి. ఫ్రెంచ్ ఫ్రైస్, చీజీ నాచోలని అస్సలు తినొద్దు.

ఎందుకంటే ఈ రెండు పదార్థాల్లోనూ సోడయం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకి హానికరం.

ఒకవేళ ఆల్కహాల్ తోపాటు సాల్టీ ఫుడ్ తీసుకుంటే మాత్రం ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావొచ్చు.

ఆల్కహాల్ తోపాటు పిజ్జా తింటే కడుపు ఖాళీ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇది యాసిట్ రిఫ్లక్స్ కి కారణమవుతుంది.

పిజ్జాలోని ఆమ్మ టమాటోలు GERD, యాసిడ్ రిఫ్లక్స్.. గుండెల్లో మంట ఎక్కువయ్యేలా చేస్తాయి.

ఒకవేళ ఆల్కహాల్ తోపాటు పిజ్జా తినాలనుకుంటే.. టమాటోలు, అంతగా కొవ్వు లేని పిజ్జా ఏదైనా తీసుకోవచ్చు.

ఆల్కహాల్ తాగేటప్పుడు, ఆ తర్వాత గానీ చాక్లెట్, కెఫిన్, కోకో లాంటి వాటికి దూరంగా ఉండండి.

ఇవి ఇతర ఆమ్ల ఆహారాల ద్వారా ప్రేరేపించబడే గ్యాస్ట్రో సమస్యలని ఎక్కువయ్యేలా చేస్తాయి.

పైన చెప్పిన వాటికి బదులు.. ఉప్పు తక్కువగా ఉండే సలాడ్స్, గింజల్ని తీసుకోండి.

(ఈ ఆర్టికల్ లో రాసినవి అన్నీ.. ఇంటర్నెట్ లోని సమాచారం ఆధారంగా రాశాం. కచ్చితమనే శాస్త్రీయ ఆధారాలు ఏం లేవు.)