మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించకపోతే చాలా బాధపడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అలా వచ్చే సమస్యల్లో ముందుగా ప్రభావితమయ్యేది మూత్రపిండాలేనట.

మనిషి శరీరంలో అతి ముఖ్యమైనవి మూత్రపిండాలు.

బాడీలోని విషపదార్థాలను, వ్యర్థాలను తొలగించేందుకు పనిచేసే మూత్రపిండాల పనితీరు మీదే శరీర ఆరోగ్య వ్యవస్థ ఆధారపడి ఉంటుంది.

మార్చి 9న కిడ్నీ డే సందర్భంగా మూత్రపిండాల గురించి కొన్ని  విషయాలు తెలుసుకుందాం.

డయాబెటిస్, హైబీపీ లాంటి అనేక జీవనశైలి మార్పు వల్ల కలిగే వ్యాధులు మూత్రపిండాల పనితీరుపై చాలా ప్రభావం చూపిస్తాయి.

మూత్రపిండాలను ఆరోగ్యకరంగా ఉంచుకోవాలంటే ముందుగా తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

కూల్ డ్రింక్స్, జంక్​ ఫుడ్​కు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే తీపి పదార్థాలను ఎక్కువగా తినకూడదు.

మాంసం కంటే కూడా కాయగూరలు, ఆకుకూరలు లాంటి శాకాహార భోజనం ఎక్కువగా తింటే మంచిది. ఇవి కిడ్నీలను హెల్తీగా ఉంచుతాయి.

దానిమ్మ, అంజీర్, స్ట్రాబెరీలు, ఆపిల్, అనాస, ద్రాక్ష, నారింజ పండ్లను క్రమం తప్పకుండా తింటూ ఉండాలని హెల్త్ ఎక్స్​పర్ట్స్​ సూచిస్తున్నారు.

పై 7 రకాల పండ్లను తింటే కిడ్నీ సమస్యలు ఎప్పటికీ దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

 ఆ ఏడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, కాల్షియం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయని అంటున్నారు.

ఆ పండ్లు తింటే కిడ్నీతో పాటు గుండె జబ్బులను కూడా నివారించొచ్చని చెబుతున్నారు.