వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి
అలానే వేసవికాలంలో తిండి, పానీయాలు త్వరగా పాడవుతాయి.
అందుకే చాలా మంది మార్కెట్ నుంచి పండ్లను తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెడుతుంటారు.
ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వస్తువులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయని జనం నమ్ముతుంటారు.
ఒక్కోసారి ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువుల రుచి మారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
పుచ్చకాయ కూడా అటువంటి పండు, పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
ఫ్రీజ్ లో ఉంచిన పుచ్చకాయల వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే, దాని పోషక విలువలు తగ్గుముఖం పడతాయంట.
పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.
కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యానికి హానికరం మారుతుంది.
అందుకే పొరపాటున కూడా పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
అలానే వేసవిలో పుచ్చకాయ అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
వేసవి కాలంలో పుచ్చకాయ చాలా మంచి పండుగా పరిగణించబడుతుంది.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పుచ్చకాయా చక్కగా పనిచేస్తుంది.
ఇందులో తక్కువ కెలరీలు ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపికగా పరిగణించబడుతుంది.
ఇందులోని అంశాలు ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది.