ఈ రోజుల్లో చాలా మందికి ముక్కలేని ముద్ద దిగదు. ఇక ముక్కలేని సమయంలో కనీసం స్పైసీ ఫుడ్ అయినా ఉండాల్సిందే.

చాలా మంది  వారంలో రెండు మూడు సార్లైనా స్పైసీ ఫుడ్ తీసుకుంటున్నారు. 

స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

అసలు ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక మసాలాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డీప్ ఫ్రై చేసిన ఆహారం తీసుకున్నప్పుడు అవి కడుపులోకి వెళ్లి పొట్ట లోపలి భాగంలో అతుక్కుంటాయి.

అధిక మసాల కలిగిన ఆహారం, ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తినడం ద్వారా గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయట.

స్పైసీ ఫుడ్ అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చి తిన్న ఆహారం తొందరగా జీర్ణం కాదట. దీంతో పాటు ఎసీడీటీని కలిగిస్తుందట.

కారం ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదట. కారం కణాలు కడపు, ప్రేగు బాగాలకు అతుక్కోవడం ద్వారా మరిన్ని అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి.

మనం స్పైసీ ఫుడ్ తీసుకోకుండా శరీరానికి కుల్ గా ఉండే పదార్థాలను అందించాలని నిపుణులు చెబుతున్నారు.  

పైగా వయసు మీద పడుతున్న వ్యక్తులు అధిక కారం ఉన్న ఆహార పదరార్థాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక నుంచైనా స్పైసీ ఫుడ్ తినడం కాస్త తగ్గించి శరీరానికి కుల్ గా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.