గుమ్మడి గింజలు తింటే ఈ వ్యాధులు రావు..
గుమ్మడి గింజల్లో ఫోలేట్, బీటా కెరోటిన్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి.
ఈ విటమిన్లు విటమిన్ ఎ కళ్ళకి మేలు చేస్తుంది.
గుమ్మడి గింజలు పునరుత్పత్తి అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది.
గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్ ఎ కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్ ఇ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గుమ్మడి గింజలు తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం మానసిక ప
్రశాంతతను కలిగిస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే హాయిగా నిద్ర పడుతుంది.
మధుమేహం ఉన్న వారు గుమ్మడి గింజలు తింటే మంచిది.
ఇందులో ఉండే పీచు పదార్థం షుగర్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గుమ్మడి గింజలు రక్తపోటుని నియంత్రణలో ఉంచుతాయి. పక్షవాతం సమస్యను తగ్గిస్తాయి.
గుమ్మడి గింజల్లో ఉండే ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
గుమ్మడి గింజలు మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.