చాలా మంది పాలక్ - పన్నీర్ ని కలిపి వండుకుంటూ ఉంటారు. 

మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడూ పాలక్ పన్నీర్ కర్రీ తినే ఉంటారు.

ఒకవేళ మీరు కనుక ఎక్కువగా పాలక్ పన్నీర్ తింటుంటే మాత్రం ఓసారి ఇది చదవండి. ఆ తర్వాత తీసుకోవడం మానేస్తారు.

పాలక్ పన్నీర్ ని కలిపి తీసుకుంటే సమస్య వస్తుందట. ఆరోగ్య నిపుణులు ఈ విషయాన్ని చెప్పారు.

మరి ఈ రెండిటిని కలిపి తింటే ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పన్నీర్ మరియు పాలక్ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివే.

డైట్ లో వీటిని తీసుకుంటే మనకి చక్కటి లాభాలు ఉంటాయి.

పాలక్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

తేలికగా మనం వండుకోవచ్చు కూడా. పన్నీర్ లో అయితే ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

కొన్నిసార్లు తినే కాంబినేషన్స్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

ముఖ్యంగా క్యాల్షియం- ఐరన్ కలిపి తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి.

పన్నీర్ లో క్యాల్షియం, పాలక్ లో ఐరన్ ఉంటుంది.

వీటిని కలిపి తినడం వల్ల పన్నీర్ లోని క్యాల్షియం, పాలక్ లోని ఐరన్ శోషణని నిరోధిస్తుంది.

ఇలా బాడీలోని ఐరన్ ని క్యాల్షియం అడ్డుకుంటుంది.కావాలంటే పాలక్ తో బంగాళాదుంప లేదంటే ఇతర కూరగాయలని వండుకోండి.

ఈ రెండింటినీ కలిపి వండుకోవడం వలన ఇలాంటి సమస్య కలుగుతుంది కాబట్టి ఆ తప్పుని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.