వేప ఆకులు తినటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. అది కడుపులో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

పరగడుపున వేప ఆకులు తినడం వల్ల హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు శక్తి లభిస్తుంది.

వేప ఆకులు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు ఉపయోగపడతాయి.

కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా వేపాకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.

అయితే, అతిగా వేప ఆకుల్ని తింటే అది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజుకు 6 నుంచి 8 వేప ఆకులను మాత్రమే తీసుకోవాలి. 

అంతకు మించి వేప ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

అవేంటంటే.. వేప ఆకులను క్రమం తప్పకుండా నమలడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

ఇలాంటి టైంలో మనం పెద్ద మొత్తంలో వేప ఆకులను నమిలితే అది చక్కెర స్థాయిని మరింత తగ్గిస్తుంది.

ఇక, గర్భిణులు వేప ఆకులను తీసుకునే ముందు నిపుణుడిని తప్పక సంప్రదించాలి.

వేప ఆకుల రసం కళ్లలో పడితే మంట పుడుతుంది, అంతేకాదు కళ్లు పాక్షికంగా ఎర్రగా మారుతాయి. 

అందువల్ల వేపాకు రసాన్ని జుట్టుకు రాసేటప్పుడు అది కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

వేపను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోరు రుచిని కోల్పయే ప్రమాదం కూడా ఉంది.