ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నేటి కాలం యువత సమయానికి అస్సలు భోజనం చేయడం లేదు.

మరీ ముఖ్యంగా లేట్ నైట్ డిన్నర్లు అంటూ అర్థరాత్రి భోజనం చేస్తున్నారు. 

ఇలా సమయానికి తినకుండా చివరికి లేని పోని రోగాల బారినపడుతున్నారు. 

అసలు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? 

నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఈ రోజుల్లో చాలా మంది రాత్రి 10 దాటిన తర్వాతే డిన్నర్ చేస్తున్నారు. 

అలా రాత్రిళ్లు భోజనం చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పూట మనం పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం చేయాలి. 

రాత్రి 8 గంటల లోపు భోజనం చేయడం చాలా మేలు.

అలా సమయానికి భోజనం చేయకపోవడం ద్వారా  అల్సర్. ఎసీడీటీ వంటి సమస్యలు వస్తాయట. 

అంతేకాకుండా జీర్ణక్రియ సంబంధమైన రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

రాత్రి 8 గంటల లోపు భోజనం చేయకపోవడం వల్ల పొట్ట చుట్టు కొవ్వు పెరుకుపోవడమే కాకుండా షుగర్ లెవర్స్ పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరీ ముఖ్యంగా రాత్రిపూట మసాలతో కూడిన వంటకాలు కాకుండా తాజా పండ్లు తీసుకోకపోవడం మంచిదట.