నేటి ఆధునిక కాలంలో మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో పడి.. ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లను తినాలని వైద్యులు ఓ పక్క చెబుతూనే ఉన్నారు.

అయితే కాలానికి అనుగుణంగా తాజా పండ్లను తింటే అనారోగ్యం మీ దరికి చేరదని నిపుణులు సూచిస్తున్నారు.

కివి పండ్లు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో జబ్బుల నుంచి ముప్పు తప్పుతుంది అంటున్నారు నిపుణులు.

మరి ఇలాంటి పండ్లను చలికాలంలో తింటున్నారా? చలికాలంలో కివి పండ్లను తింటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం!

కివి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను పోషకాల నిధి అంటారు. కాపర్, విటమిన్ కె, ఇ, ఫొలెట్ లు ఈ పండ్లలో ఉంటాయి.

ఈ పండ్లలో తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. 

దాంతో బాడీ వ్యాధులకు లోనయే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

కివి పండ్లలో అధిక మోతాదులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంతో పాటు గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుతుంది.

వీటిల్లో ఉండే ఎంజైమ్స్ జీర్ణక్రియ సమస్యల నిరోధకానికి తోడ్పడతాయి. 

మలబద్దకంతో బాధపడేవారు రోజూ ఈ పండును తింటే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

కివి పండ్లలో 14 శాతం విటమిన్ సి ఉంటుంది. దీని వల్ల చర్మానికి, జుట్టుకు ప్రయోజనం కలుగుతుంది. ఇక విటమిన్ సి తో శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది.

నిద్రలేమితో బాధపడే వారికి కివి పండ్లు ఓ వరం అంటారు నిపుణులు.

వీటిని తినడం వల్ల నిద్ర బాగా పట్టి, మానసికంగా ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

నోట్: మేం చెప్పిన సలహాలు పాటించే ముందు ఓసారి మీ దగ్గరలోని వైద్యులు, నిపుణుల సలహా కూడా తీసుకోండి.