నేటికాలం భోజనాలకు ప్లాస్టిక్ ప్లేట్లను, కాగితపు ప్లేట్లను వాడుతున్నారు. పూర్వం అరిటాకుల్లో మాత్రమే భోజనం చేసే వారు

అరిటాకుల్లో భోజనం చేయడమనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయం. 

ఎందుకు అరటాకునే భోజనాలకు ఉపయోగిస్తారు అనే సందేహం చాలా మందికి వస్తుంది.

అరిటాకులో భోజనం చేయడం వెనుక కూడా  ఆరోగ్య రహస్యం దాగి ఉంది. 

అరిటాకులో యాంటీ ఆక్సిడెంటల్ ను కలిగి ఉన్న పాలీ ఫినాల్స్ ఎక్కువగా  ఉంటాయి.

వేడి వేడి ఆహార పదార్థాలు వడించగానే  అరటి ఆకు పై పొరల్లో ఉండే పాలీ ఫినాల్స్ భోజనంలో కలిసిపోతాయి. 

దీని వల్ల శరీరానికి పోషకాలు అందడమే కాకుండా తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది.

అరటి పండులో ఉన్నట్టే అరిటాకులో కూడా పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.

అరిటాకుపై భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.

అరిటాకులో భోజనం చేయడం వల్ల వాత, కఫ దోషాలు తొలగిపోతాయి.

అరిటాకులలో భోజనం చేయడం వల్ల మన వెంట్రుకలు నల్లగా, దృఢంగా మారుతాయి. 

ఏదైనా ఆహార పదార్థంలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఆ పదార్థాన్ని మనం పడేస్తూ ఉంటాం.

ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థంపై అరటాకును మూతగా పెట్టి కొద్ది సమయం ఉంచాలి.

దీంతో అధికంగా ఉన్న ఉప్పును అరటాకు గ్రహించి పదార్ధాన్ని రుచిగా మారుస్తుంది. 

ఈ విధంగా అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి.