సాధార‌ణంగా అందరూ రోజుకు మూడుసార్లు భోజ‌నం చేస్తుంటాం

ఉద‌యం టిఫిన్, మ‌ధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేస్తుంటారు. 

కొందరు రోజుకు రెండు పూటలే భోజనం చేస్తారు

ఇలా అలవాట్లు, ఇష్టాలు ఎవరివి వారికి ఉంటాయి 

కానీ.. ఎందుకో చాలామంది భోజ‌నాన్ని వేగంగా తింటుంటారు 

ఏదైనా హ‌డావిడి లేదా ప‌ని వల్ల వేగంగా తింటారేమో.. కానీ అలా చేస్తే అనేక అన‌ర్థాలు పొంచిఉన్నాయి

భోజ‌నాన్ని వేగంగా తిన‌డం వ‌ల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం

వేగంగా తిన‌డం వ‌ల్ల ఆహారం అధికంగా తీసుకుంటారు.. దీంతో శ‌రీరంలో అధిక ఆహారం కొవ్వుగా మారుతుంది. 

శరీరం బ‌రువు పెరిగి.. స్థూల‌కాయం వచ్చే అవకాశం ఉంది

ఫ‌లితంగా డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశాలు

ఆహారాన్ని వేగంగా తింటే జీర్ణ‌ సమస్యలు ఏర్పడుతాయి

దానివల్ల గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌లు వచ్చే అవకాశం ఉంది

అలాగే దీర్ఘ‌కాలంలో జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మందగించడం జరుగుతుంది

అందుకే వైద్యులు కూడా బాగా నమిలి, మెల్లగా తినాలని చెబుతుంటార

మరి ఇకనైనా తినడం విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన