పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే అరటి, దానిమ్మ, ద్రాక్షని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే దీని వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా చాలానే ఉన్నాయట.

ప్రస్తుత జనరేషన్ లో డ్రాగన్ ఫ్రూట్ గురించి చాలామందికి తెలుసు. దీన్ని పిటయా అని కూడా అంటారు. ఇది చూడ్డాడానికి తామర పువ్వులా ఉంటుంది.

ఇక డ్రాగన్ ఫ్రూట్ లో తెల్ల గుజ్జు, ఎర్ర గుజ్జు ఉండే రెండు రకాల పండ్లు ఉంటాయి. ఇవి మంచి టేస్టీగా ఉండటమేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సీ, ప్రోటీన్, ఫైబర్, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్.. గుండెని హెల్తీగా ఉంచుతాయి.

ఈ ఫ్రూట్ లోని యాంటీ ఆక్సిడెంట్స్.. రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి. దీనిలోని మెగ్నీషియం.. హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

మన బాడీలోని కొవ్వును తగ్గించడానికి డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్.. కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడతాయి.

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల పొట్ట సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. దీనిలోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా మారుతుంది.

దీనిలోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మలబద్దకం,కడుపునొప్పి లాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

పెద్ద ప్రేగు, శోథ, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లాంటి వ్యాధులని తగ్గించడానికి సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ లోని ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలని పెంచి రక్తహీనతని పోగొడుతుంది.

ఈ ఫ్రూట్ లోని కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. కీళ్ల నొప్పి సమస్యలు ఉన్నా సరే తగ్గుతాయి.

డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధులు వచ్చే ఛాన్సు తగ్గుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ వల్ల బరువు తగ్గుతారు. మరోవైపు దీనిలోని షుగర్ కంటెంట్ వల్ల బరువు పెరిగే ఛాన్సులు కూడా ఎక్కువే.

ఈ ఫ్రూట్ తినడం వల్ల మలబద్ధకం సమస్యలు తొలిగిపోతాయి. కానీ ఇదే డ్రాగన్ ఫ్రూట్ ని అతిగా తీసుకుంటే డయేరియా సమస్యలు వస్తాయి.

నోట్: మేం చెప్పిన సలహాలు పాటించే ముందు ఓసారి మీ దగ్గరలోని వైద్యులు, నిపుణుల సలహా కూడా తీసుకోండి.