కీర‌దోస‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు. దీనిలో ఫైబ‌ర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

కీరదోసలోని ఫైబర్, మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోతాయి.

కీరదోస తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

కీర‌దోస‌లోని పొటాషియం, మెగ్నిషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రుస్తాయి. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కీర‌దోస‌లోని విట‌మిన్ కె.. గాయమైనప్పుడు ర‌క్తం గ‌డ్డక‌ట్టడానికి స‌హాయ ప‌డుతుంది. మ‌నం తినే ఫుడ్స్ లోని కాల్షియంని శ‌రీరం శోషించుకునేందుకు విట‌మిన్ కె హెల్ప్ చేస్తుంది.

కీర‌దోస‌ను చాలా మంది ఎండకాలంలో తింటారు. శ‌రీరానికి చలువ చేస్తుంది కాబట్టి. తద్వారా ఎండ వేడి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

వాస్త‌వానికి కీర‌దోస‌ను కేవ‌లం వేస‌విలోనే కాదు.. ఏ సీజ‌న్‌లో అయినా స‌రే తినొచ్చు. దీంతో మ‌నం చాలా ప్ర‌యోజనాల‌ను పొందొచ్చు.

చాలా మంది కీర‌దోస‌ని భోజనంతోపాటు తింటుంటారు. అన్నం తింటూ మ‌ధ్యమ‌ధ్య‌లో కీర‌దోస ముక్క‌ల‌ను తింటారు. కానీ ఇది మంచిది కాదట.

కీర‌దోస చ‌లువ చేసే ప‌దార్థం. వీటిని ఉడికించ‌రు. ప‌చ్చిగానే తింటారు. ఇక భోజ‌నం అంటే ఉడ‌క‌బెట్టిన ఆహారం. ఒకేసారి ఈ రెండింటిని తింటే.. శరీరంలో ఆమ్లం పెరుగుతుంది.

దీంతో వాత‌, పిత్త‌, కఫ దోషాల్లో డిఫరెన్సెస్ వ‌స్తాయి. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ కు కారణమవుతుంది. కాబట్టి ఉడ‌కించిన‌, ఉడ‌క‌బెట్ట‌ని ఆహారాల‌ను ఒకేసారి తిన‌రాదు.

ఒకవేళ తిన్నాసరే రెండింటిని తినే మధ్య కనీసం గంట గ్యాప్ అయినా సరే ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

భోజనంతోపాటు కీర‌దోస‌ తిన‌కూడదని.. గంట ముందు లేదా  గంట తర్వాతే కీర‌దోస‌ను తీసుకోవాల‌ని.. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు  వస్తాయని డాక్టర్స్ హెచ్చ‌రిస్తున్నారు.

ప‌చ్చి ఆహారాల‌ను, ఉడ‌కించిన ఆహారాల‌ను ఒకేసారి క‌లిపి తింటే అది జీర్ణ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపిస్తుంది. దీంతో జీర్ణ‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది.

దీని వల్ల గ్యాస్, మల బద్దకం సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వండిన ఫుడ్ తోపాటు పచ్చి ఆహార పదార్థాలు ఎప్పుడు తినకూడదు.

ఇకపై కీరదోసని భోజనంతో పాటు కలిపి తీసుకోవడం మానేయండి. లేదంటే కోరి సమస్యలని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.

నోట్: పైన టిప్స్ పాటించే ముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.