సహజంగా మాంసాహార ప్రియులకు చికెన్ అంటే ఎంతో ప్రీతి

రోజూ కాకపోయినా వారానికి ఒక్కసారైనా చికెన్ టేస్ట్ చేస్తుంటారు

వారికి నచ్చిన విధంగా పలు రకాలుగా చికెన్ ని వండుకుంటారు

అయితే.. చికెన్ ని ఫ్రై, కర్రీ, బిర్యానీలతో పాటు పచ్చడి కూడా చేస్తుంటారు

ఈ మధ్యకాలంలో కొందరు స్కిన్ తో తీసుకుంటుంటే, ఎక్కువమంది స్కిన్ తీసేసి తింటున్నారు.

అయితే.. అందరిలోనూ ఒకే సందేహం చికెన్ ని స్కిన్ తో తినాలా? స్కిన్ లేకుండా తినాలా? అని

ఇంతకీ చికెన్ స్కిన్ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారు.. స్కిన్ ఉంచాలా? తీసేయాలా?

చికెన్ స్కిన్‌ లో అన్‌ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయని, అవి ఆరోగ్యానికి మంచివి కాద‌ని అంటుంటారు

పోష‌కాహార నిపుణుల ప్ర‌కారం.. చికెన్ స్కిన్‌ లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఉంటాయట

కాబ‌ట్టి చికెన్ ని స్కిన్‌ తో కూడా తిన‌వ‌చ్చు. కానీ.. త‌క్కువ‌గా తినాలని చెబుతున్నారు 

చికెన్ స్కిన్‌ ను ప‌రిమిత మోతాదులో తింటే శ‌రీరానికి నష్ట‌మేమీ ఉండ‌ద‌ని నిపుణుల అభిప్రాయం

అయితే.. చికెన్ ని స్కిన్ తో ఎక్కువగా తింటే శ‌రీరంలో కొవ్వుశాతం పెరిగి బ‌రువు పెరుగుతార‌ట

చికెన్ స్కిన్‌ తో తిన్నా ఆరోగ్యంగా ఉండాలంటే.. త‌క్కువ మోతాదులో తీసుకుంటే బెటర్