వంటింట్లో వాడే పదార్థాల గురించి తెలుసుకోవాలే గానీ.. వంటిల్లే ఓ ఔషధాల గది.

వాటి ఉపయోగం తెలుసుకుంటే మనం చాలా వరకు వ్యాధుల నుంచి దూరం కావొచ్చు.

ముఖ్యంగా చలికాలంలో నల్లమిరియాలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్లమిరియాలను చలికాలంలో రోజూ తినాలని చెబుతున్నారు వైద్యులు.

తద్వారా ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

నల్లమిరియాల్లో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రేగులను శుభ్రం చేస్తుంది.

నల్లమిరియాల్లో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రేగులను శుభ్రం చేస్తుంది.

దాంతో పాటుగా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య నుంచి సులువుగా బయటపడుతారని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక గ్రీన్ టీలో నల్ల మిరియాలను వేసుకుని రోజూ రెండు, మూడు సార్లు తాగితే త్వరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులను తగ్గించడంలో నల్ల మిరియాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

వీటిల్లో ఉండే ఔషధ గుణాలు అర్థరైటీస్ నొప్పులను బాగా తగ్గిస్తాయి.

దగ్గు సమస్య(శ్లేష్మం) ఉన్న వారికి నల్లమిరియాలు అద్భుత ఔషధంగా ఉపయోగపడతాయి.

అందుకే వీటిని ఆహార పదార్థాలతో కలిసి తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: పై చిట్కాలు పాటించే ముందు దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలను తీసుకోండి.