తమలపాకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

తమల ఆకులు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

అందుకే మన పూర్వికుల కాలం నుంచి తమలపాకులను ఉపయోగిస్తూ వస్తున్నారు. 

సాధారణంగా చాలా మందికి భోజనం చేసిన తర్వాత వీటిని తినే అలవాటుంటుంది. 

వీటిలో నియాసిన్, కెరోటిన్, విటమిన్ సి, రైబోఫ్లావిన్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలుంటాయి. 

భోజనం అనంతరం తమలపాకులు తినడం వలన కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తమలపాకు ఎలాంటి నొప్పులనైనా ఇట్టే తగ్గించగలదు. 

అలాగే జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

చలికాలంలో తమలపాకును తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. 

తమలపాకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. 

మలబద్దకం సమస్యకు  తమలపాకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

ఆస్తమా, ఛాతి నొప్పిని తగ్గించడంలో  కూడా తమలపాకులు ఉపయోగపడతాయి

తమలపాకు వేసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

తమలపాకులు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. 

తమలపాకులను వేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో తమలపాకులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

ఇలా తమలపాకులతో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.