ఎవరిని కలిసినా నవ్వుతూ పలకరించాలి అంటారు.

అయితే అందరూ మనస్ఫూర్తిగా నవ్వుతూ పలకరించేందుకు వెనుకాడుతూ ఉంటారు.

మనసులో వారికి చక్కగా నవ్వాలి అని ఉన్నా.. నవ్వేందుకు మాత్రం వెనుకాడుతూ ఉంటారు.

ఎందుకంటే వారి దంతాలు అంత తెల్లగా, చక్కగా ఉండవని వారికి భయం.

ఎన్ని ప్రయత్నాలు చేసినా దంత సౌందర్యాన్ని సాధించలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఇప్పుడు చెప్పుకోబోయేవి తినడం వల్ల దంతాల ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

యాపిల్స్‌ తినడం వల్ల ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు.. దంతాలు కూడా తెల్లగా మెరిసిపోతాయి అంటున్నారు.

యాపిల్స్‌ తినడం వల్ల దంతాల ఎనామిల్‌ శుభ్రపడి.. తెల్లగా మెరిసిపోతాయి.

స్ట్రాబెర్రీలు అంటే అందరికీ ఇష్టమే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా.

అలాగే స్ట్రాబెర్రీల్లో ఉండే విటమిన్ సీ మీ దంతాలను తెల్లగా అయ్యాలే చేస్తుంది.

పైనాపిల్‌ అంటే ఇష్టం ఉండని వారు ఎవ్వరూ ఉండరు. దీనిలో ఖనిజాలు, విడమిన్లు పుష్కలంగా ఉంటాయి.

పైనాపిల్‌లో బ్యాక్టీరియా పెరుగుదలను ఆపే బ్రొమెలైన్ ఎంజైమ్ అధికంగా ఉంటుంది.

చీజ్‌ని తినేందుకు అందరూ ఇష్టపడరు.. దీన్ని కొద్ది మొత్తంలో రోజూ తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి.

చీజ్‌ తినడం ద్వారా పళ్లు కూడా ధృడంగా, తెల్లగా అవుతాయి.

పుట్టగొడుగుల్లో(మష్రూమ్స్‌) విటమిన్‌ డీ పుష్కలంగా లభిస్తుంది.

అంతేకాకుండా పుట్టగొడుగులు తినడం వల్ల దంతాలు గట్టిగా మారుతాయి.