మనకు రెగ్యులర్ గా లభించే కూరగాయలలో క్యాబేజీ ఒక‌టి

ఎందుకోగానీ క్యాబేజిని తినేందుకు చాలామంది ఇష్ట‌ప‌డ‌రు

క్యాబేజిని ఇష్టపడేవారు ఎన్నో రకాలుగా వండుకొని తింటుంటారు

క్యాబేజిని ఫాస్ట్ ఫుడ్ లో, పకోడీ తయారీలో కూడా ఉపయోగిస్తారు

అయితే.. ఫుడ్ విషయంలోనే కాకుండా క్యాబేజి ఆరోగ్యం పరంగా ఎంతో మేలు చేస్తుంది

ముఖ్యంగా అధిక బ‌రువు ఉన్నవారు క్యాబేజి తినడం వల్ల బరువు త‌గ్గ‌వ‌చ్చని సమాచారం

ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం.. క్యాబేజీ తింటే వారంలో దాదాపు 4.50 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ట

క్యాబేజీలో ప్రోటీన్లు, కాల్షియం అత్య‌ధికంగా ఉంటాయి.. అవి ఎముక‌లు, కండరాలకు బలాన్నిస్తాయి

అయితే.. బరువు తగ్గేందుకు క్యాబేజిని ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం!

బ‌రువు తగ్గాలనుకునే వారు క్యాబేజీని రోజుకు ఒక క‌ప్పు మోతాదులో తినాలని నిపుణులు చెబుతున్నారు

భోజ‌నానికి 10 నిమిషాల ముందు క్యాబేజిని ఉడ‌క‌బెట్టి, బాగా నమిలి తింటే మంచిదట

అలా చేస్తే క‌డుపు నిండిన ఫీలింగ్ కలిగి ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు.

ఆ తర్వాత శ‌క్తి కోసం ఒంట్లో ఉన్న కొవ్వును శరీరం క‌రిగిస్తుందని, ఆ విధంగా బ‌రువు తగ్గవచ్చని నిపుణుల సూచన

మరి ఇంకెందుకు ఆలస్యం క్యాబేజి లవర్స్ మీరూ ట్రై చేసి చూడండి