మనకి రెడ్ క్యారెట్ తెలుసు. కానీ నల్ల క్యారెట్ గురించి పెద్దగా తెలియదు. 

కానీ దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నల్ల క్యారెట్ లో పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి సహా అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

నల్ల క్యారెట్ రక్తాన్ని శుభ్రం చేసి మలినాలను తొలగిస్తుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.

నల్ల క్యారెట్ జ్యూస్ తాగితే రక్తపరిమాణం పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతుంది.  

నల్ల క్యారెట్ లో ఉండే ఆంథోసైనిన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

నల్ల క్యారెట్ లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, అలసట, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేయడానికి నల్ల క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది.

నల్ల క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

నల్ల క్యారెట్ డైలీ తినడం వల్ల కళ్ళకు మేలు జరుగుతుంది. కళ్ళజోడు వాడకం తగ్గే అవకాశం ఉంది.

నల్ల క్యారెట్ తినడం వల్ల అల్జీమర్స్ సోకే ప్రమాదం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

నల్ల క్యారెట్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆంథోసైనిన్ నాడీ సంబంధిత వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

డయాబెటిస్ ఉన్న వారు నల్ల క్యారెట్ తింటే మంచి ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది.    

ఈ నల్ల క్యారెట్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడడమే గాక క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేస్తుంది.

గమనిక: నల్ల క్యారెట్ వల్ల పైన చెప్పిన ఫలితాలు ఉంటాయన్నదాంట్లో నిజమెంతో తెలియదు. కానీ నల్ల క్యారెట్ తినడం వల్ల ప్రాణాలు అయితే పోవు. జనాలు గమనించగలరు.