మాస్ సినిమాలకు ఎప్పుడైనా సరే డిమాండ్ అస్సలు తగ్గదు. కరెక్ట్ గా తీస్తే చాలు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది.

అలా గత కొన్నాళ్ల నుంచి రస్టిక్, మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ఎక్కువగా హిట్స్ కొడుతున్నాయి.

ఈ లిస్టులో అల్లు అర్జున్ 'పుష్ప', యష్ 'కేజీఎఫ్' ముందు వరసలో ఉంటాయి. ఈ రెండు వందల కోట్ల వసూళ్లు సాధించాయి.

ఇప్పుడు ఇదే జానర్ లో నాని హీరోగా నటించిన మూవీ 'దసరా'. రిలీజ్ కు ముందే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

శ్రీరామనవమి కానుకగా తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? టాక్, రేటింగ్ ఏంటనేది రివ్యూలో చూద్దాం.

కథ: వీర్లపల్లి అనే పల్లెటూరు. చుట్టు బొగ్గు గనులు, మైన్స్ ఉంటాయి. ఈ ఊరిలో ధరణి(నాని), వెన్నెల(కీర్తి సురేష్), సూరి(దీక్షిత్) ఉంటారు.

చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన వీళ్లు.. పెద్దగా అయిన తర్వాత కూడా అదే బాండింగ్ మెంటైన్ చేస్తూ ఉంటారు.

ధరణి చిన్నప్పుడే వెన్నెలని ప్రేమిస్తాడు. ఆ విషయం చెప్పాలనుకుంటాడు. కానీ సూరి కూడా ఆమెనే లవ్ చేస్తున్నాడని డ్రాప్ అయిపోతాడు.

ఇక చిన్నప్పటి నుంచి చాలా భయస్థుడిగా మారిన సూరి.. పిల్లిని చూసినా సరే ఉచ్చపోసుకుంటూ ఉంటాడు. అందుకే మద్యానికి బానిస అవుతాడు.

బతకడం కోసం ఫ్రెండ్స్ తో కలిసి బొగ్గు దొంగతనం చేస్తుంటాడు. కొన్నాళ్లకు వీర్లపల్లిలో రాజకీయాలు చాలా ఫాస్ట్ గా మారిపోతాయి.

ధరణి, వెన్నెల, సూరి లైఫ్ లోనూ అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో వీర్లపల్లిలో మొత్తం పరిస్థితులు తారుమారు అవుతాయి.

మరి చివరకు ఏమైంది? పిల్లిని చూస్తేనే భయపడే ధరణి.. మనుషుల్ని చంపేంతవరకు ఎందుకు వెళ్లాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 'దసరా' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ సినిమా. అలా అని కత్తి విడిచి సాము చేయలేదు.

మూవీ ఓపెనింగ్ సీన్ నుంచి చకాచకా స్టోరీలోకి వెళ్లిపోతుంది. వీర్లపల్లి ఊరు, అక్కడి పరిస్థితులు, మనుషుల మనస్తత్వాలని చూపిస్తూ వెళ్లారు.

బొగ్గు దొంగతనం చేసే సీన్ తో హీరో నాని అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత వెన్నెల, సూరి క్యారెక్టర్స్ కూడా వచ్చేస్తాయి.

అలా ఈ ముగ్గురి బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్లారు. ఎంట్రీ సాంగ్, కామెడీ, ఎమోషనల్ సీన్.. ఇలా ఒక్కొక్కటితో మెల్లగా కథలోకి తీసుకెళ్లారు.

ఫస్టాప్ అంతా కూడా స్టోరీని సెట్ చేసుకోవడానికి ఉపయోగించారు. సరిగ్గా ఇంటర్వెల్ పడే సమయానికి మైండ్ పోయే సీన్ వస్తుంది.

ఇక ఫస్టాఫ్ తెగ భయపడుతూ, మందు తాగుతూ ఉంటే ధరణి పాత్ర.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఆ రెండింటిని పక్కనబెట్టేస్తాడు. విలన్ల పని పడతాడు.

ఫస్టాఫ్ లో ఓన్లీ ఎమోషన్ ని నమ్ముకున్నారు. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం అటు ఎమోషన్ డ్రామాతో పాటు యాక్షన్ ని కూడా నమ్ముకున్నారు.

సెకండాఫ్ లో అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. క్లైమాక్స్ ఫైట్ అయితే వేరే లెవల్లో ఉంటుంది. ఈ ఎపిసోడ్ లో మీరు నాని విశ్వరూపం చూస్తారు.

అప్పటివరకు నాని ఎప్పుడు ఫైట్ చేస్తాడా అని ఎదురుచూస్తు వచ్చిన ఆడియెన్స్.. క్లైమాక్స్ ఫైట్ తో ఫిదా అయిపోతారు. అరిచి గోలగోల చేస్తారు.

ఈ ఫైట్ జరుగుతున్నంతసేపు కూడా రాముడు రావణ సంహారం చేయడం అనే లైన్ గుర్తొస్తుంది. ఆ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ వస్తాయి.

నటీనటులు& టెక్నికల్ టీమ్ పనితీరు: ఈ సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత నాని-కీర్తి సురేష్ నటించిన ధరణి, వెన్నెల క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి.

నాని ఇప్పటివరకు చేసిన సినిమాలు ఓ ఎత్తైతే.. 'దసరా'లో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్. కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ రోల్ లో సరిగా సెట్ అయిపోయింది.

సూరి క్యారెక్టర్ చేసిన దీక్షిత్ శెట్టి, విలన్ చిన నంబిగా చేసిన షైన్ టామ్ చాకో అయితే ఆయా రోల్స్ కి ఫెర్ఫెక్ట్. మిగతా వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్ లో ముందుగా చెప్పుకోవాల్సింది రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి. చేస్తుంది ఫస్ట్ మూవీనే అయినా ఎంతో అనుభవమున్న వాడిలా తీశాడు.

చాలాచోట్ల గురువు సుకుమార్ స్టైల్ ఫాలో అయినట్లు అనిపిస్తుంది గానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇండస్ట్రీకి మరో అద్భుతమైన దొరికేశాడనే చెప్పాలి.

సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, 'ధూం ధాం'- 'చమ్కీలా అంగిలేసి' పాటలు అయితే స్క్రీన్ పై చాలా బాగా కనిపించాయి.

సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ని బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: నాని మాస్ యాక్టింగ్, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ ఫైట్

మైనస్ పాయింట్స్: యాక్షన్ కాస్త తక్కువగా ఉండటం

రేటింగ్: 3/5

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే గమనించగలరు