ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఆయన గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
శ్రీనివాసమూర్తి మరణంలో ట్విస్ట్ చేటుచేసుకుంది.
మరణానికి ముందు ఆయన తన నివాస గృహంలోని రెండవ అంతస్తు నుంచి కిందపడినట్లుగా తెలుస్తోంది.
కిందపడ్డ ఆయనకు గుండెపోటు వచ్చిందని సమాచారం.
గుండెపోటు వచ్చిన ఆయన్ని కుటుంబసభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసమూర్తి మరణించారు.
కాగా, శ్రీనివాసమూర్తి ఇప్పటివరకు 2వేల సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.
సూర్య, అజిత్, విజయ్, విక్రమ్, రాజశేఖర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి హీరోలకు తెలుగులో తన గొంతును అరువిచ్చారు.
తెలుగు హీరోల సినిమాలకు తమిళ్, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పారు.