ఆయుర్వేదం ప్రకారం.. పచ్చి అల్లం కంటే శొంఠే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిది.

ఎందుకంటే పచ్చి అల్లం కంటే శొంఠి ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుంది.

అల్లంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ఇవి అనేక రోగాలను నయం చేయడంలో ఉపయోగపడతాయి.

చిన్న అల్లం ముక్కను తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య పోయి.. కడుపు శుభ్రపడుతుంది.

అయితే అల్లంను ఎండబెట్టి పొడి చేసి కూడా వాడుతుంటారు. దీన్నే శొంఠి అంటారు.

పచ్చి అల్లంలో పోల్చితే శొంఠే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ శొంఠీ వలన ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది.

శొంఠి వల్ల వాతం సమస్య తగ్గుతుంది. అదే పచ్చి అల్లం తీసుకుంటే ఈ సమస్య పెరుగుతుంది.

కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో శొంఠీనే శక్తివంతగా పనిచేస్తుంది. 

మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడంలో శొంఠి  బాగా పనిచేస్తుంది.

వానాకాలం, చలికాలంలో వచ్చే కఫం సమస్యకు శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. 

శొంఠి శ్వాస తీసుకోవడంలో వలన కలిగే ఇబ్బందులను కూడా  తగ్గిస్తుంది.

శొంఠి తీసుకోవడం వలన శరీరం బరువు కూడా తగ్గుతుంది.  

వేడి చేసిన నీటిలో శొంఠిని మరగించి.. ఆ నీటిలో తేనె కలుపుకుని తాగితే కొవ్వుతు తగ్గుతుంది.

ఇలా పచ్చి అల్లం కంటే శొంఠినే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.