ఆ పద్దతుల ప్రకారం తాగితేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు
నీళ్లను ఎక్కువ తాగకపోతే బలహీనత, జుట్టురాలడం, మలబద్దకం, చర్మం పాలిపోవడం వంటివి జరుగుతుంటాయి
నీళ్లను కూర్చొని తాగడమే ఉత్తమనని సూచిస్తున్నారు.. మరి ఎందుకో చూద్దాం!
నిలబడి నీళ్లను తాగితే మూత్రపిండాలకు మంచిది కాదట.. దీంతో రక్తం నుంచి విషపదార్థాలను తొలగించడం కష్టమై కిడ్నీ సమస్యలు ఏర్పడే అవకాశము ఉందట
నీళ్లను నిలబడి తాగితే అన్నవాహికపై ప్రభావం పడుతుంది.. దీంతో లంగ్స్, శ్వాసకోశ వ్యవస్థపై ఎఫెక్ట్ పడి, గుండె సమస్యలకు దారితీస్తుందట
నిలబడి నీళ్లను తాగడం వల్ల కీళ్లు, ఎముకలపై ప్రభావం పడుతుందని.. ఇలా చేస్తే కీళ్లు అరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు