ఓ పూట తిండి లేకపొయిన పర్వాలేదు కానీ దాహం వేసినా వేయకున్న నీటిని గంట గంటలకు ఖచ్చితంగా తీసుకోవాలని డాక్టర్లు మనకు సూచిస్తుంటారు.

నీరు శరీరానికి చాలా అవసరమని, అందుకే నీటిని బాగా తీసుకోవాలని తెలియజేస్తుంటారు.

డాక్టర్లు చెప్పారు కదా అని లీటర్లు, లీటర్లు తాగడం కూడా మంచిది కాదట.

అలా కొంతమంది అవసరానికి మించి నీటిని తాగుతుంటారు. శరీరానికి కావాల్సిన నీటి కన్న ఎక్కువ నీటిని తీసుకోవడం ద్వారా ఏరికోరి సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని కూడా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

అవసరానికి మించి ఎక్కువ నీటిని తాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ నీటిని తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల చేపట్టిన పరిశోధనలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. 

పరిశోధకులు ముందుగా కొంతమందిని ఎంపిక చేసుకున్నారు. అందులో సగం మందిని ఎక్కువ నీరు తాగమని, మరికొంత మందిని దాహం వేసినప్పుడే మాత్రమే నీరు తాగమని చెప్పారు.  

 అనంతరం ఎక్కువ నీటిని తాగిన వ్యక్తులను, దాహం వేసినప్పుడు తాగిన వక్తులను ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు.

ఎక్కువగా తాగిన మేదడులో ఉండే ఫ్రి ఫ్రంటల్ ప్రాంతాలు చాలా ఆక్టివ్ గా ఉన్నాయని తెలింది. ఇలా ఆక్టివ్ గా ఉండడం ద్వారా తినాలన్న, నమలాలన్న ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుసుకున్నారు.

మనం నీరు అధికంగా తీసుకోవడం ద్వారా హైపోనెట్రేమియా అనే వ్యాధి కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉందట.

హైపోనెట్రేమియా అనే వ్యాధి వస్తే శరీరంలోని ద్రవాలు పలుచబడి, సోడియం ప్రమాణాలు పడిపోతాయట.

శరీరంలోని  ద్రవాలు పలుచబడి, సోడియం ప్రమాణాలు పడిపోవడంతో కణాల వాపునకు గురవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

దీనిని బట్టి పరిశోధకులు నీటిని దాహం వేసినప్పుడు మాత్రమే తాగాలని తెలియ జేస్తున్నారు.

కొందరు వైద్యులు చెబుతున్నట్లు రోజుకు 5 లీటర్లు తాగడం శరీరానికి మంచేది కావచ్చు. కానీ అందిరికీ ఇది మంచిది కాదని నిపుణులు తేల్చారు.