సాధారణంగా ఏదైన ఫంక్షన్ జరిగితే ఆ వేడుకలో స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఇక ఆ స్వీట్స్ ను చూడగానే మనకి నోరూరడం ఖాయం. దాంతో అటూ ఇటూ చూసి నోట్లో వేసుకుని లొట్టలేసుకుంటూ తింటాం.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ తిన్న స్వీట్స్ తిన్న తర్వాత కొందరు వెంటనే నీరు తాగుతుంటారు.

ఇలా స్వీట్స్ తిన్న తర్వాత వెంటనే నీరు తాగితే.. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలినట్లు నిపుణులు చెప్పారు.

తీపి పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగితే.. బ్లడ్ షుగర్ లెవల్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

నీరు మానవ శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం డెజర్ట్ తిన్న తర్వాత నీరు తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

స్వీట్స్ తినే ముందు గానీ తిన్న తర్వాత  గానీ సుమారు 30 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక స్వీట్లు తిన్న వెంటనే దాహం వెయ్యడానికి ప్రధాన కారణం.. స్వీట్లలో ఉండే గ్లూకోజ్ కడుపు ఖాళీ అయ్యే సమయాన్ని తగ్గిస్తుంది.

దాంతో ద్రవాలు ప్రేగులకు చేరవు, అక్కడ అవి శోషించబడతాయి. అందుకే మీకు స్వీట్స్ తిన్న వెంటనే దాహం వేస్తుంది.

స్వీట్స్ తిన్న వెంటనే నీరు తాగితే మీ జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే తీపి పదార్థాలు తిన్న తర్వాత నీరు తాగకూడదు అని వారు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.