నీరు శరీరానికి ఎంతో అవసరం. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు తాగడం వల్ల విషంగా మారే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరో విషయం ఏంటంటే? తినేటప్పుడు కానీ, తిన్న తర్వాత కొంత సమయంలో కానీ, నీళ్లను తీసుకోవడం ఎంతో డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నీళ్లను తాగితే విషంగా మారడం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మనలో చాలా మంది వ్యక్తులు ఆహారం తినే సమయంలో పదే పదే నీళ్లను తాగుతూ ఉంటారు. ఇలా నీళ్లను తాగడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

 ఒకవేళ తినే సమయంలో నీళ్లను తాగితే విషంగా మారే అవకాశం కూడా ఉందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

అయితే మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు శరీరంలో విడుదలయ్యే రసాయనాలు చాలా ఉపయోగపడతాయి.

 ఈ క్రమంలోనే మనం తిన్న వెంటనే, తినే సమయంలో నీళ్లను తీసుకోవడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయట.

ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడే రసయనాలు సైతం పలుచబడే అవకాశం లేకపోలేదని నిపుణులు తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా జీర్ణ సమస్యలు, మలబద్దకం వంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

నిపుణుల ప్రకారం.. ఆహారం తినే సమయంలో, తిన్న రెండు గంటల వరకు నీళ్లు తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Note: ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం దగ్గరలోని వైద్యుడిని సంప్రదిండి.