ఈ రోజుల్లో చాలా మంది ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రోజులో దాదాపుగా 5 నుంచి 10 సార్లు టీ తాగుతుంటారు.

ఉదయం ఇంట్లో, మధ్యాహ్నం ఆఫీసులో, ఈవినింగ్ రోడ్డుపై ఇలా రోజుకు పరిమితికి మించి టీ తాగుతూ చివరికి రోగాల బారిన పడుతున్నారు.

 అసలు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? ఎక్కువ సార్లు తాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

టీలో కెఫిన్, రిఫైన్డ్ షుగర్ ఉంటాయి. రోజుకు ఎక్కవ టీ తాగడం లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి.

రోజుకు ఎక్కువ సార్లు తాగడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరుగుతుంది. 

తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అమాంతంగా పెరుగుతుందని తెలియజేస్తున్నారు. 

టీ తాగడం మంచిదే, కానీ పరిమితికి మించి తాగితేనే అనారోగ్య సమస్యలు అంటున్నారు నిపుణులు

 అసలు టీని ఎక్కువగా తాగడం వల్ల మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

 అంతేకాకుండా అధిక రక్తపోటు, ఎసిడిటి, పేగు సమస్యలు, గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 అంతే కాదండోయ్.. ఉభయ కాయం, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

అయితే ఆరోగ్యం కోసం రోజులో రెండు మూడు సార్లు టీ తాగితే మంచిదని, అంతకుమించి తాగితే డేంజర్ అంటున్నారు నిపుణులు