ప్రస్తుతం బయట ఎండలు దంచి కొడుతున్నాయి. 

దీంతో జనాలు అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు.

ఎండాకాలంలో వేసవి తాపం నుంచి బయటపడేందుకు చాలా మంది చల్లని నీళ్లు, కూల్ డ్రింక్స్ తాగేందుకు ఇష్టపడుతుంటారు.

 మరీ ముఖ్యంగా ఎండాకాలంలో చెరుకు రసం జ్యూస్ తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.

ఎండాకాలంలో చెరుకు రసం అధిక తాగడం వల్ల లేని పోని అనారోగ్య సమస్య వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు చెరుకు రసం ఎక్కువగా తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచింది. కానీ, మోతాదుకు మించి తాగాలని పోషకాహర నిపుణులు సూచిస్తున్నారు.

మాములుగా రోడ్లపై దొరికే చెరుకు రసాన్ని అపరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారు చేస్తుంటారు. 

తద్వారా ఎస్చెరిచియా కోలి, సాల్మోనెల్లా, విబ్రియో కలరా వంటి బ్యాక్టిరియా అందులో చేరుతుంది. 

అది తాగడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగడమే కాకుండా మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.

 చెరుకు రసం ఎక్కువగా తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి ఎక్కువగా జరగడంతో పాటు నీటి శాతం కోల్పోయి డీహైడ్రేషన్ కు గురవుతారు.

చెరుకు రసంలో చెక్కర స్థాయిలు అధికంగా ఉంటాయి.

దీనిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి పెరిగి హైపర్లైసీమియాకుతో పాటు అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ రసాన్ని ఎక్కువగా తాగడం వల్ల మధుమేహంకు కూడా దారి తీయవచ్చని చెబుతున్నారు. 

చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల దంతాలపై ఉండ ఎనామిల్ పోర కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్న ఈ చెరుకు రసాన్ని మోతాదుకు మించి అస్సలు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.