వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది చ‌ల్లని నీళ్లను తాగుతుంటారు.

అయితే చాలా మంది ఫ్రిజ్‌ల‌లోని చల్లని నీటిని తాగుతున్నారు. 

వాస్తవాన్నికి ఫ్రిజ్‌ల‌లో నీళ్లు వ‌ల్ల మ‌న‌కు అనేక దుష్ప్రభావాలు క‌లుగుతాయి. 

ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగడం వలన కలిగి చెడు ప్రభావాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అతి చ‌ల్లగా ఉండే నీళ్ల వలన జీర్ణవ్యవ‌స్థపై ప్రభావం ప‌డుతుంది.

ఈ చల్లని నీటి వల్ల ఫుడ్‌‌ సరిగ్గా జీర్ణంకాక..పోషకాలు శరీరానికి అందవు. 

కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్‌‌ ట్రబుల్ లాంటి సమస్యలు ఏర్పడతాయి.

చివరకు ఈ ఫ్రీజ్ లో నీటిని తాగడం వలన  శ్వాస కోశ స‌మ‌స్యలు వస్తాయి. 

మ‌ట్టి కుండ‌ల్లో అయితే మ‌రీ అతిగా చ‌ల్లగా నీళ్లు మార‌వు.

మ‌నం తాగే మోతాదులోనే కుండ నీళ్లు చ‌ల్లగా అవుతాయి.

క‌నుక మ‌ట్టి కుండ‌లోని చ‌ల్లని నీళ్లను తాగ‌వ‌చ్చు.

ఫ్రీజ్ లోని చల్లని నీరు ఎక్కువ తాగితే తలనొప్పి, సైనస్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి.

తిన్న వెంటనే కూల్‌‌ వాటర్ తాగితే శరీరం లోని కొవ్వు బయటికి పోదు.

బరువు తగ్గాలనుకున్న వాళ్లు కచ్చితంగా కూల్‌‌ వాటర్‌‌‌‌కు దూరంగా ఉంటే మంచిది.

కూల్‌ వాటర్‌ తాగే బదులు ఫ్రూట్‌‌ జ్యూస్‌‌లు, కొబ్బరి నీళ్లు తాగడం బెటర్‌‌‌‌