చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకంగా 5 లేదా 6 సార్లు తాగుతుంటారు.

కాఫీ అతిగా తాగడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా సమ్మర్ లో ఎక్కువగా కాఫీ తాగితే చాలా డేంజర్ అంటూ కూడా హెచ్చరిస్తున్నారు.

సమ్మర్ లో కాఫీ ఎక్కువగా తాగడం వల్ల వచ్యే అనారోగ్య సమస్యలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కాఫీని ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందట.

కాఫీని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆజీర్తీ సమస్యతో పాటు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కూడా కాదని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా బీపీ, హార్ట్ ఎటాక్ వంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు

రోజులో 2 లేదా 3 సార్లు కాఫీ తాగితే సరిపోతుందని, అంతకు మించి తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

Note: ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం దగ్గరలోని వైద్యుడుని సంప్రదించండి