నేటి కాలం యువత గంజాయి, మద్యానికి అలవాటు పడుతున్నారు.

పైగా ఈ రోజుల్లో ఇదే ఫ్యాషన్ అంటూ చివరికి అనారోగ్యాల పాలవుతున్నారు.

ఇక ఇందులో చదువుకునేవారు ఎక్కువగా ఉండడం విశేషం. 

మరీ ముఖ్యంగా కాలేజ్ యువత మాత్రం అధికంగా బీర్ తాగుతూ లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. 

బీర్ తాగడం వల్ల మంచిదే అని ఎవరికి వాళ్లు డబ్బా కొట్టుకుంటున్నారు

బీర్ ఎక్కువగా తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? 

అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు  తెలియాలంటే తప్పకుండా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

బీర్ తాగడం వల్ల లాభం కంటే నష్టాలే అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 ఎక్కువగా బీర్ తాగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. 

 డయాబెటిస్, అధిక కొవ్వు ఉన్నవారు బీర్ తాగడం చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు బీర్ తాగడం ద్వారా కాలేయం మీద ఎక్కువగా ప్రమాదం చూపే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా పేగుల్లో అలజడి, కడుపులో మంట, అలర్స్ వంటి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లవుతారని నిపుణులు సూచిస్తున్నారు.