ఈ రోజుల్లో చాలా మంది రోజుకు కనీసం మూడు లేదా నాలుగు సార్లైన టీ తాగుతున్నారు.

ఆఫీసులో పని ఒత్తిడి, రోజంతా శ్రమ వంటి వాటి నుంచి కాస్త రిలీఫ్ కోసం చాలామంది టీని తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 

మాములుగా బయట మనం ఎక్కడ టీ తాగినా.. తప్పని పరిస్థితుల్లో పేపర్ కప్స్ లో తాగిల్సి వస్తుంది. 

కానీ, పేపర్ కప్స్ లో టీ తాగడం అనేది చాలా ప్రమాదమంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. 

పేపర్ కప్స్ లో టీ తాగడం వల్ల నష్టాలేంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇటీవల లండన్ లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్ లో కొందరు శాస్త్రవేత్తలు కీలక సూచనలతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. 

 కాగితంతో తయారు చేసిన కప్స్ లో టీ, కూల్ డ్రింక్స్ తాగుతూ చివరికి క్యాన్సర్ బారిన పడుతున్నారని సైంటిస్ట్ లు తెలిపారు. 

15 రకాల కెమికల్స్ లను కలిపి ఈ కాగితపు కప్స్ తయారు చేస్తారని స్పష్టం చేశారు. 

అలా తయారు చేసిన పేపర్ కప్స్ లో వేడి వేడి టీ పోయడం వల్ల అందులో ఉన్న కెమెకల్స్ బయటకు తేలి విషపూరితమైన టీగా మారుతుంది.

ఇక అదే టీని మనం తాగడం ద్వారా క్యాన్సర్ తో పాటు అనేక రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్ట్ లు హెచ్చరించారు.

ఇక నుంచైన పేపర్ కప్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.