నేటి ఆధునిక జీవితంలో ఉదయాన్నే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరికి మార్నింగ్ టీ తాగకపోతే తలనొప్పి కూడా వస్తుంది.

అలా అని రోజులో ఎక్కువ మెుత్తంలో టీలు, కాఫీలు తాగితే లేనిపోని రోగాలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అదీ కాక బయట టీ స్టాల్స్ లోని ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే చాలా మంది మట్టి కప్పుల్లో టీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు

అయితే మట్టి కప్పుల్లో టీ, కాఫీలు తాగడం వల్ల అనేక  లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.

చాలా హోటల్స్ ప్రస్తుతం మట్టి కప్పుల్లోనే  టీ లు సర్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ సెట్టర్ గా నడుస్తోంది. 

ఈ కప్పుల్లో టీ రుచితో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందట.

మట్టి కప్పుల్లో సహజ అల్కేన్ ఉంటుంది. టీ తాగినప్పుడు ఇది కడుపులోకి వెళ్లి.. యాసిడ్ రాకుండా నిరోధిస్తుంది. దాంతో ఎసిడిటీ సమస్య మీ దరికి చేరదు.

పింగాని కప్పులు, గాజ్ గ్లాస్ ల్లో టీ తాగితే.. అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. 

అదే మట్టి కప్పుల్లో అయితే ఇలా సాక్రమిక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పేపర్ కప్పుల్లో టీ తాగితే.. అందులో ఉండే పాలీ  స్టైరిల్ అనే పదార్థం టీ వేడికి కరుగుతుంది. 

దాన్ని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చివరగా మట్టి కప్పుల్లో టీ తాగితే చాలా రుచిగా ఉంటుంది. మట్టి కప్పుల్లో రుచి మారదు. పైగా గ్రామీణుల ఉపాది మెరుగుపడుతుంది కూడా.