మనకు దాహం వేయడం చాలా సహజం. అలా జరిగినప్పుడు మంచి మీరు తాగుతాం. కొందరు కూల్ డ్రింక్స్ తాగుతారు.
వేసవికాలంలో కొందరు కూల్ డ్రింక్స్ ని మరీ ఎక్కువగా తాగుతుంటారు. ఇళ్లలోని ఫ్రిజ్ లోనూ నిల్వ చేస్తూ ఉంటారు.
అయితే ఈ కూల్ డ్రింక్స్ వల్ల అప్పటికప్పుడు ఎనర్జీ వస్తుందేమో కానీ తర్వాత వీటి ఎఫెక్ట్ మన ఆరోగ్యంపై గట్టిగా పడుతుంది.
మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే కూల్ డ్రింక్స్ గురించి కొన్ని భయంకర నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మన పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు 50 టన్నుల ఆహారాన్ని మన దంతాలతో నమిలి తీసుకుంటాం.
అన్ని టన్నుల ఫుడ్ నమిలిన అరగని ఈ పళ్లని.. ఓ కూల్ డ్రింక్ నెల తిరగకుండానే కరిగించేస్తుంది.
ఊడిపోయిన పళ్లని ఓ కూల్ డ్రింక్ బాటిల్ లో వేసి నెలరోజులు ఆగి చూడండి. నిజం మీకే తెలుస్తుంది.
మరకలు పట్టిన సింక్ పై కూల్ డ్రింక్ వేసి చూడండి. 5 నిమిషాల్లో తెల్లగా మెరుస్తుంది. యాసిడ్ తో సమానమైన ఈ కూల్ డ్రింక్స్ నే మనం తాగుతున్నాం.
కూల్ డ్రింక్స్ లో ఫాస్పరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎముకల్లో కాల్షియం తగ్గితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎముకల విరిగిపోతాయి. ఇలా జరగకపోయినా కొన్ని రోజులకు శరీరం ఏ పనులకు సహకరించదు.
కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కూల్ డ్రింక్స్ వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం కూడా ఉంది. క్యాన్సర్ కూడా రావొచ్చు.
కూల్ డ్రింక్స్ నిల్వ ఉండటానికి మనం బయటకు వదిలే కార్బన్ డై యాక్సైడ్ ని ఉపయోగిస్తారు.
ఇలా కూల్ డ్రింక్స్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కాబట్టి వీటిని వీలైనంత వరకు దూరం పెట్టండని నిపుణులు చెబుతున్నారు.
నోట్: మేం చెప్పిన సలహాలు పాటించే ముందు ఓసారి మీ దగ్గరలోని వైద్యులు, నిపుణుల సలహా కూడా తీసుకోండి.