వేసవి కాలంలో రావడంతో చాలా మంది చల్లటి పదార్థాలు, కూల్ డ్రింక్స్ తాగేందుకు ఇష్టపడుతుంటారు.
మరీ ముఖ్యంగా కొంత మంది మాత్రం ఎండ కాలం తాపం నుంచి భయటపడేందుకు కొబ్బరి నీళ్లు తాగుతుంటారు.
పైగా సహజ సిద్దమైనవి కావడంతో అందరూ బోండాలు బోండాలు తాగేస్తుంటారు.
అలా కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగే ముందు మీరు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయా? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఎండకాలంలో చల్లగా ఉంటాయని చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతుంటారు.
కాస్త టెస్టీగా ఉండడంతో వాటిని ఎక్కువగా తాగేస్తుంటారు.
అయితే కొబ్బరి నీళ్లు లీటర్లకు లీటర్లు తాగడం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఈ కొబ్బరి నీళ్లలో పొటిషియం ఎక్కువగా ఉంటుంది, దీనిని తీసుకోవడం వల్ల హైపర్ కలేమియా ఏర్పడి స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లు అతిగా తాగడం ద్వారా జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చట.
అధిక రక్త చక్కెర ఉన్న వ్యక్తులు రోజుకు ఒక గ్లాసుకు మించి కొబ్బరి నీళ్లు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
మూత్రపిండ సమస్యలు ఉన్నవారు సైతం కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
గమనిక: ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం వైద్యులను సంప్రదించండి