ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎక్కువగా ఇష్టపడి సేవించే పానీయాలలో బీర్ ఒకటి బీర్ కూడా ఎప్పుడో ఓసారి తాగితే పర్వాలేదు..

కానీ రెగ్యులర్ గా సేవించేవారు కూడా కోట్లలో ఉన్నారు

తాగాలని అనిపించినప్పుడల్లా కూల్ డ్రింక్ మాదిరే బీర్ ని పుచ్చుకుంటున్నారు మద్యం ప్రియులు'

అయితే.. బీర్ లో 5-6% ఆల్కహాల్ ఉంటుంది.. కాబట్టి మితంగా తాగితే హెల్త్ కి మంచిదని అంటుంటారు

పదే పదే తాగితే మాత్రం.. బీర్ కూడా ఆరోగ్యానికి ముప్పు తెస్తుందనే విషయాన్ని గ్రహించాలి

వైద్య నివేదికల ప్రకారం.. బీర్ ఎక్కువగా తాగితే మనిషిలో ఆందోళన, డిప్రెషన్ పెరిగే అవకాశం ఉందట

కొందరు ఒత్తిడి తగ్గేందుకు బీర్ తాగుతుంటారు.. కానీ, అధికంగా సేవిస్తే ఒత్తిడి తగ్గదనే విషయాన్ని గ్రహిస్తే మంచిది

ముఖ్యంగా జీర్ణక్రియ, లివర్ ప్రాబ్లెమ్స్ ఉంటే బీర్ తాగడం తగ్గిస్తే మంచిదని నిపుణుల సలహా

ఆల్కహాలిక్ హెపటైటిస్ లాంటి తీవ్రమైన సమస్యలు రాకూడదంటే బీర్ కి దూరంగా ఉంటే బెటర్

బీర్ ఎక్కువగా తాగితే సిర్రోసిస్ సమస్య పెరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయాలు వెల్లడించాయి

బీర్ తాగడం వల్ల బరువుతో పొట్ట కూడా వేగంగా పెరిగిపోతుంది.. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది

బీపీ ఉన్నవారు బీర్ తో పాటు మద్యం జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి