మ‌నం ఎంతో ఇష్టంగా తీసుకునే ఆహారంలో ఒకటి మొక్క‌జొన్న.

మొక్క‌జొన్న‌ల‌ను మ‌నం కాల్చుకుని, ఉడికించుకుని, గింజ‌ల‌ను వేయించి తింటూ ఉంటాం. 

మొక్క జొన్న పిండితో కూడా రొట్టెల‌ను త‌యారు చేస్తారు. వీటి గింజ‌ల నుండి నూనెను కూడా తీస్తారు.

మొక్కజొన్న పీచులో  విలువైన పోషకాలు ఉంటాయి. ఈ విషయం తెలియక చాలా మంది మొక్క జొన్న పీచు లను పడేస్తుంటారు.

ఈ మొక్కజొన్న పీచును సాంప్రదాయ వైద్యంలో మన దేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా వాడుతున్నారు.

మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం, విటమిన్లు బి 2, సి మరియు కె వంటి కీలకమైన పోషకాలు ఉన్నాయి

ఇందులో  ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది

మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా ఈ మొక్క జొన్న పీచు సహాయపడుతుంది. 

రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని తాగితే ఎంతో నియంత్రణ ఉంటుంది

శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించి బ‌రువును త‌గ్గించ‌డంలో కూడా ఈ టీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్రస‌వానంత‌రం స్త్రీలు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తస్రావం అధికంగా అవ‌కుండా ఉంటుంది.

మొక్కజొన్న టీ ని తాగ‌డం వ‌ల్ల అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. జీర్ణవ్యవ‌స్థ మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి.

దెబ్బలు తాకి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేది విటమిన్ కె. ఈ విటమిన్. మొక్కజొన్న పీచులో కె ఈ మొక్కజొన్న పీచులో అధికంగా ఉంటుంది.

శరీరంలో ఉన్న అదనపు నీరు మరియు వ్యర్థాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. 

డయాబెటిస్ నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. 

మొక్కజొన్న పీచు టీ మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

కీళ్ళలో అధిక యూరిక్ యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. 

మొక్కజొన్న పీచులో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.