జుట్టు అందంగా కనిపించడానికి మనం ఎన్నో రకాల రసయనాలు కలగలిసిన షాంపూలను వాడుతుంటాం.

ముఖ్యంగా స్నానం చేసే క్రమంలో తలపై ఉండే జిడ్డును తొలగించడానికి షాంపూను వాడుతుంటాం.

మార్కెట్ లో దొరికే ఏది పడితే అది వాడి చివరికి జుట్టు సమస్యల బారిన పడుతున్నారు.

నిపుణులు మాత్రం.. జుట్టుకు షాంపూ రాసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదని, చేస్తే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

జట్టుకు షాంపూ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

జుట్టు అందంగా కనిపించేందుకు మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల షాంపులను వాడుతుంటారు.

చాలా మంది జుట్టుకు షాంపూ వాడే క్రమంలో నేరుగా జుట్టుకు అంటించి నురగ వచ్చేంత వరకు రుద్దుతూ ఉంటారు.

అలా చేయడం చాలా పొరపాటని నిపుణులు చెబుతున్నారు.

ముందుగా షాంపూని నేరుగా తలకు అంటించకుండా ముందుగా ఓ డబ్బాలో పోసి నీళ్లలో మిక్స్ చేసి దాంతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

 అలా చేయడం వల్ల ఆ షాంపోలో ఉండే రసయనాలు జుట్టు మూలాలకు వర్తించదు. తద్వారా జుట్టును రక్షించుకోవచ్చు.

 తల స్నానం కంటే ముందు జుట్టుకు నూనే రాసుకోవాలి. ఆ తర్వాత తల స్నానం చేస్తే జుట్టు పొడిబారదు.

తల స్నానం చేసే ముందు ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లైతే మీ జట్టును రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.