హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా మంది ఇళ్లు కట్టడానికి, రంగు వేసుకోవడానికి వాస్తు శాస్త్రాన్ని నమ్ముతుంటారు.

ఇదే కాకుండా ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, బెడ్ రూం ఎక్కడ ఉండాలి, దేవుని గుడి ఎక్కడుండాలనేవి కూడా వాస్తు ప్రకారం చూసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు.

ఇళ్లు కట్టుకోవడమే కాదు.., ఇంటికి ఎలాంటి రంగును వేసుకోవాలని కూడా చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతుంటారు. 

కొత్తగా నిర్మించుకున్న లేదా నిర్మిందలచిన ఇంటికి ఎలాంటి రంగు వాడాలి? వాస్తు పండితులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఇంటికి వేసుకునే రంగు విషయంలో వాస్తుని పాటిస్తే ఆరోగ్యంతో  పాటు అభివృద్ధి కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఇళ్లు కట్టుకోవడమే కాదు.., ఇంటికి ఎలాంటి రంగును వేసుకోవాలని కూడా చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతుంటారు.

ముఖ్యంగా ఇంటికి ఆగ్నేయ దిశలో నారింజ, పసుపు, గులాబి రంగు వేస్తే మంచిదని పండితులు అభిప్రాయపడుతున్నారు. 

ఇలాంటి రంగులు వేసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు ప్రశాంతత వస్తుందట.

ఉత్తర భాగంలో పిస్తా, ఆకు పచ్చ రంగు వేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, లక్ష్మీ దేవి అనుగ్రహం దక్కుందని పండితులు చెబుతున్నారు.

ఉత్తర్ వైపు అయితే మాత్రం స్కై బ్లూ కలర్, పడమర వైపు నీలం రంగు వేస్తే బాగుంటుందని చెబుతున్నారు.

సౌత్ లో మాత్రం గులాబి రంగు  వేసుకుంటే చాలా మంచిదట. ఇవే కాకుండా బెడ్రూమ్ లో అయితే స్కై బ్లూ కలర్ వేసేలా చూసుకోవాలట.

ఇక ఇంటి లోపల పై భాగంలో మాత్రం తెలుపు రంగు వేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత దొరకడంతో పాటు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని పండితులు సూచిస్తున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.