నిద్ర లేచిన దగ్గరి నుంచి మళ్లీ తిరిగి నిద్రపోయే వరకు సెల్ ఫోన్ లేకుండా బతికే పరిస్థితి కనిపించడం లేదు.

ఇప్పటికే 5000, 6000 ఎంఏహెచ్ తో చాలా స్మార్ట్ ఫోన్లు మార్టెక్ లో రిలీజ్ అవుతున్నాయి.

ఎంత బ్యాటరీ అయినా ఒక్కసారైనా ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఆ సమయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయద్దు.

ఛార్జర్: మీ స్మార్ట్ ఫోన్ తో వచ్చిన ఛార్జర్ ని మాత్రమే మీ ఫోన్ ఛార్జ్ చేయడానికి వాడండి.

మీరు వేరే వేరే ఛార్జర్స్‌ వాడితే బ్యాటరీ హెల్త్‌ తగ్గిపోవడమే కాకుండా.. బ్యాకప్ కూడా బాగా తగ్గిపోవచ్చు.

పదే పదే ఛార్జింగ్: మీలో చాలా మంది స్మార్ట్ ఫోన్ కి రోజులో మూడు, నాలుగు సార్లైనా ఛార్జింగ్ పెడుతూ ఉంటారు.

అలా చేయడం చాలా పెద్ద తప్పు. అలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.

ఒకసారి ఛార్జింగ్ పెడితే మళ్లీ 20లోపు వచ్చే వరకు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టకూడదు. 

క్వాలిటీ తక్కువ ప్లగ్స్: మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టే ఛార్జర్ ఎంత ముఖ్యమో.. పవర్ సప్లై ఇచ్చే వాల్ ప్లగ్ కూడా అంతే ముఖ్యం.

అందుకే క్వాలిటీ తక్కువగా ఉండే వాల్ ప్లగ్స్‌, ఛార్జర్స్ ను వాడకూడదు.

ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడొద్దు: నూటికి 80 శాతం మంది ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి వాడుతుంటారు.

ఓవైపు ఛార్జింగ్ అవుతుంటుంది, మరోవైపు మీరు ఫోన్ ఆపరేట్ చేస్తుంటారు.

అలా చేయడం వల్ల మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

పౌచ్ కూడా ప్రమాదమే: ఫోన్ కి డ్యామేజ్ కాకూడదని పౌచ్ లు వాడుతుంటారు. 

అయితే ఛార్జ్ చేస్తున్న సమయంలో పౌచ్ ఉంచడం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. అలా చేయకండని నిపుణులు కూడా చెబుతున్నారు.