ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది వేసవి తాపం నుంచి బయటపడేందుకు రక రకాల జ్యూస్ లు తాగుతుంటారు.

 ముఖ్యంగా చెరుకు రసం, పుచ్చకాయ, కొబ్బరి బోండాలు వంటి చల్లటి పదార్థాలను తీసుకుంటుంటారు.

ఇదిలా ఉంటే కొంతమంది పుచ్చకాయ, పాలు కలిపి ఒకేసారి తీసుకుంటుంటారు. రుచిగా ఉండడంతో చాలా మంది తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు.

అలా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ, పాలు కలిపి తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పాలు, పుచ్చకాయ రెండు విరుద్ద పదార్థాలు. పాలులో తీపి గుణాలు ఉంటే, పుచ్చకాయలో మాత్రం పుల్లటి రుచి ఉంటుంది.

ఈ రెండు కలిస్తే విషపూరితమైన పదార్థంగా తయారవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మీరు పుచ్చకాయ, పాలు ఒకే సమయంలో తీసుకుంటే పుచ్చకాయలో ఉండే ఆమ్లాలు పాలలోని ప్రోటీన్లలో కరిగి, పాలను విచ్ఛిన్నం చేస్తాయి.

తద్వారా  పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు.

  ఈ రెండింటిని కలిపి తాగడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండు ఒకేసారి కాకుండా వేరు వేరుగా తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా నిపుణులు చెబుతన్నారు.

 మొత్తానికి పుచ్చకాయ, పాలు ఒకేసారి కలిపి తీసుకుంటే చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.