మనిషి ఆకర్షణ కళ్లలోనే ఉంటుంది. అందుకే కొంత మంది కళ్లలోకి చూడాగానే పడిపోతారు.

మరి అలాంటి కళ్లు.. నేటి ఆధునిక అలవాట్లు, పొల్యూషన్ కారణంగా అందవిహీనంగా తయారు అవుతున్నాయి.

మరి అలాంటి కళ్లు.. నేటి ఆధునిక అలవాట్లు, పొల్యూషన్ కారణంగా అందవిహీనంగా తయారు అవుతున్నాయి.

కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చి ఫేస్ ను కళకు దూరం చేస్తున్నాయి. ఈ డార్క్ సర్కిల్స్ ను చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాదం నూనె కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్ ను తొలగించడానికి బాదం నూనె చాలా బాగ పనిచేస్తుంది. 

రాత్రి పడుకునే ముందు కొద్దిగా బాదం నూనె ను డార్క్ సర్కిల్స్ పై మర్దనా చేయాలి. ఉదయాన్నే కడిగితే  మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీ బ్యాగ్స్ గ్రీన్ టీ తాగాక వాటిని మనం బయట పడేస్తాం. కానీ ఇక నుంచి అలా చేయకండి. వాటిని ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయిన తర్వాత.. 15 నిమిషాలు కళ్లపై పెట్టండి.

నల్లటి వలయాలను తగ్గించడానికి ఇవి దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

కీరదొస కీరదోసలో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు కళ్లకు చాలా మంచి చేస్తాయి. గుండ్రంగా కోసిన కీరదోస ముక్కలను ఫ్రిజ్ లో పెట్టి.. చల్ల బడ్డాక.. తర్వాత ఓ 15 నిమిషాలు మీ కళ్లపైన ఉంచండి. 

ఇలా వారంలో మూడు సార్లు చేస్తే మీ డార్క్ సర్కిల్స్ త్వరగా పోతాయి.

 బంగాళ దుంపలు బంగాళ దుంపలను గ్రైండ్ చేసి దాని నుంచి వచ్చిన రసాన్ని.. డార్క్ సర్కిల్స్ చుట్టూ అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగి.. మీరు వాడే ఐ క్రీమ్ ను రుద్దండి. 

ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే, మీ కళ్ల చుట్టూ నల్లటి వలయాలను త్వరగా వదిలించుకోవచ్చు.