ప్రస్తుతం నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హెయిర్ ఫాల్. ఆడ, మగ అని తేడాలేకుండా అందరు ఈ సమస్య బారినపడుతున్నారు.
మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కావొచ్చు.. చిన్న తనంలో జుట్టు రాలి బట్టతల వస్తూ ఉంటుంది కొందరిలో.
ఎవరైనా నల్లటి, ఒత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. ఇక జుట్టు లేక, బట్టతల కారణంగా పెళ్లిళ్లు చెడిపోయిన సందర్బాలూ ఉన్నాయి.
అయితే సాధ్యమైనంత వరకు జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు వైద్యులు. లేకపోతే చుండ్రు సమస్య వచ్చి హెయిర్ ఫాల్ అవుతుంది.
ఇక హెయిర్ ఫాల్ కాకుండా, జుట్టు ఒత్తుగా ఉండాలంటే కొన్ని పోషకాలు ఉన్న గింజలను తినాలని చెబుతున్నారు నిపుణులు. ఆ గింజలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెంట్రుకలు బలంగా ఉండాలంటే వాటికి ప్రోటీన్స్ ఎక్కువగా అందించాలి.
అందుకే సోయాబీన్స్ ను 12 గంటలు నీటిలో నానబెట్టి వంటల్లో వేసి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా తీసుకోవడం వల్ల ఊడిపోయిన వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే మెులకెత్తిన విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల బాడీ కావల్సినంత ప్రోటీన్స్ లభిస్తాయి.
ఈ ప్రోటీన్స్ జుట్టు రాలడాన్ని తగ్గించి, కురులకు బలాన్ని చేకూరుస్తాయి.
వీటితో పాటుగా ప్రతీరోజూ తలస్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
చుండ్రు సమస్య లేకపోతే వెంట్రుకలు రాలిపోవడం సగానికి సగం తగ్గిపోతుందంటున్నారు.
నోట్: పైన తెలిపిన టిప్స్ పాటించే ముందు మీ దగ్గర్లోని వైద్యుల సలహా గానీ, నిపుణుల సలహాలు గానీ పాటించండి.