వేడి గాలులు, ఉక్కపోత కారణంగా  శరీరం నుంచి చెమట రావడం సర్వసాధారణం. అయితే.. కానీ కొంతమందికి విపరీతమైన చెమటలు వస్తుంటాయి. ఇది శరీర దుర్వాసనకు కారణమవుతుంది.

ఈ విపరీతమైన చెమట, దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. వాటి ద్వారా ఈ సమస్యను వదిలించుకోవడంతోపాటు రోజంతా హాయిగా ఉండవచ్చు.. అవేంటో తెలుసుకుందాం.

సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి నేటికాలంలో ట్రెండీగా కనిపించాలనే ఉద్దేశ్యంతో వేసవిలో కూడా బిగుతుగా.. నల్లగా ముదురు రంగులో ఉండే దుస్తులను ధరిస్తుంటారు. 

దీని కారణంగా శరీరంలోని చాలా భాగాలకు గాలి చేరకపోవడంతోపాటు విపరీతమైన చెమట పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది.

వేసవిలో ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూనె ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు తినడం వల్ల అధికంగా చెమట పడుతుంది. దీని కారణంగా శరీరం నుంచి వాసన కూడా వస్తుంది.

కొవ్వు పదార్థాలు తినవద్దు..

యాపిల్ సైడర్ వెనిగర్ ద్రావణంలో కొంచెం దూది ముంచి.. చెమట ఎక్కువగా పట్టే చంకలు, తదితర ప్రదేశాలలో రాసుకోవాలి. ఇందులోని యాసిడ్.. చెమటలోని బాక్టీరియాను నశింప చేస్తుంది. దీంతో దుర్వాసన రావడం జరగదు.

యాపిల్ సైడర్ వెనిగర్

వేసవిలో ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూనె ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు తినడం వల్ల అధికంగా చెమట పడుతుంది. దీని కారణంగా శరీరం నుంచి వాసన కూడా వస్తుంది.

గ్రీన్ టీ

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా  తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ కలిపి.. ఆ ద్రావాణాన్ని శరీరంలో బాగా చెమట పట్టే భాగాలకు పట్టించాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో  కడగాలి.

బేకింగ్ సోడా

నిమ్మరసం తీసి, చంకల్లో రాయాలి, ఆరిపోయాక  గోరు వెచ్చని నీటితో కడగాలి. దీంతో దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది.

నిమ్మరసం

రెండు కప్పుల టమాట జ్యూస్ ను బాత్ టబ్ లో వేసి నీటితో కలిపి అందులో ఓ  అరగంట కూర్చోవాలి.  వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల చెమటను కలిగించే బ్యాక్టిరియా నశిస్తుంది.

టమాటా జ్యూస్

మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్  తీసుకోవాలి. ఆ రెండు కలిపి.. ఆ మిశ్రమాన్ని చెమట పట్టే ప్రదేశాల్లో స్ప్రే చేయడం వల్ల దుర్వసనను అరికట్ట వచ్చు.

రోజ్ వాటర్

ఒత్తిడి వల్ల చెటమ పట్టే వారికి ఇది మంచి చిట్కా. బాత్ టబ్ లోని వేడి నీటిలో రెండు లేదా మూడు కప్పుల ఎప్సం ఉప్పు కలపాలి. ఆ నీటితో వారానికి రెండు మూడు సార్లు  స్నానం చేస్తే  సెరేటోనిన్ అనే హార్మోన్ తయారవుతుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి, చెమటను అరికడుతుంది.

ఎప్సం సాల్ట్

ఒక టీ స్పూన్ ఫెను గ్రీక్ టీ గింజలను నీటిలో కలిపి మరిగించాలి. ఆ నీరు సగం ఇంకిపోయాక.. ఆ డికాషన్ను ఉదయానే పరగడుపున తాగాలి. ఒంట్లో వ్యర్ధాలు తొలగిపోతాయి. దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది.

ఫెను గ్రీక్ టీ

దుర్వాసనకు తెలిపిన పై చిట్కాలు కేవలం కొందరి నిపుణుల అభిప్రాయం మాత్రమే. అయితే శరీరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.