ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 

చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు.. ఎంతో మంది ఈ ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు.

ఇలా అధికబరువు సమస్యకు  ప్రధాన కారణం D విటమిన్ లోపించడమే అని చాలా అధ్యయనాల్లో తేలింది. 

బాడీ మాస్ ఇండెక్స్ శరీరంలో ఉన్న విటమిన్ డి మొత్తంతో ప్రత్యక్ష సంబంధం కలిగుందని అధ్యయనాలు తేల్చాయి. 

ఎముకల ఆరోగ్యం కోసం శరీరానికి విటమిన్ డి  తప్పనిసరిగా ఉండాలి.

ఊబకాయుల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉందని ఎన్నో  అధ్యాయనాలు చెబుతున్నాయి. 

ఆ అధ్యాయనాలను చూస్తే విటమిన్ డి కూడా బరువు పెరిగేందుకు దారితీస్తుందని అర్థమవుతోంది. 

D విటమిన్ కొవ్వుల నిల్వలపై, శరీరంలోని కొవ్వు కణాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. 

విటమిన్ డి మన శరీరంలో కాల్షియం, ఫాస్పేట్  మొత్తాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా ఉండటానికి ఈ విటమిన్ చాలా చాలా అవసరం. 

విటమిన్ డి క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. 

గుండె జబ్బులను తగ్గించడంలో విటమిన్ 'డి'  కీలక పాత్ర పోషిస్తుంది. 

 D విటమిన్  ని మొదటగా సూర్యరశ్మి ద్వారానే పొందాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. 

ఇలా మన ఆరోగ్యం విషయంలో విటమిన్ 'డి' కీలక పాత్రపోషిస్తుంది.

నోట్: మాకు అందుబాటులోని సమాచారం ఆధారంగా పైన పాయింట్స్ చెప్పాం. నెటిజన్స్ గమనించగలరు!