సరైన మసాజ్ కాలి నరాలను ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణ పెంచడం, ఒత్తిడి, నొప్పిని తగ్గించడం లాంటి ప్రయోజనాలు అందజేస్తుంది.
మీ పాదాల్లో హార్ట్ పాయింట్, లంగ్ పాయింట్, నెక్ పాయింట్ ఇలా చాలా పాయింట్లు ఉంటాయి.
వీటిని మసాజ్ చేయడం ద్వారా మీరు నొప్పి, అలసట నుంచి చాలా ఉపశమనం పొందుతారు.
ఫుట్ మసాజ్ వల్ల ఆందోళన, డిప్రెషన్ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాదాలకు మసాజ్ చేయడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట.
మూడ్ స్వింగ్స్, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కి పాదాల మసాజ్ ద్వారా సులభంగా ఉపశమనం పొందవచ్చు.
ప్రసవం అనంతరం కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఫుట్ మసాజ్ చేయడం వల్ల.. వీటిని వేగంగా నయం చేయడానికి, సాధారణ జీవక్రియ పెంచడానికి సహాయపడుతుంది.
మల్టీపుల్ స్క్లెరోసిస్ కారణంగా కొందరికి తరుచుగా డబుల్ దృష్టి ఏర్పడుతుంది. దీని వల్ల ఓ కంటిలో అంధత్వం, అస్పష్టమైన దృష్టి లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
అలాంటి సందర్భాల్లో ఫుట్ మసాజ్, ముఖ్యంగా రిఫ్లెక్సాలజీ ఆధారిత మసాజ్ అద్భుతమైనది.
శరీరంలోని లెక్కలేనన్ని నరాల చివరలు.. మన పాదాలకు అనుసంధానించబడి ఉంటాయి. అవి వెన్నెముకకు జోడించి ఉంటాయి.
వెన్నెముక పైభాగం బొటనవేలు దిగువన ఉంటుంది. కాబట్టి పాదాలపై 30-45 సెకన్ల సర్కిల్ టైపులో మసాజ్ చేస్తే.. వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది.
కొన్నిసార్లు తలనొప్పి సైనస్ ప్రాబ్లమ్ సృష్టిస్తుంది. కానీ మీ రెండు పాదాల బొటనవేలు వెలుపల ఒత్తిడి పెంచుతూ ముందుకు తిప్పంది. దీంతో తలనొప్పి తగ్గించుకోవచ్చు.