ఒత్తిడి ఎక్కువైతే మొఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, చర్మంపై దద్దుర్లు, ఎర్రని ఛారలు వంటివి ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

అధిక ఒత్తిడి కారణంగా శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

ఒత్తిడి ఎక్కువ కాలం ఉంటే తామర, సోరియాసిస్, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒత్తిడి, ఆందోళన వల్ల కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మంపై నూనె ఉత్పత్తిని పెరిగేలా చేసి.. సహజ నూనె రంధ్రాలను మూసి వేస్తుంది.

దీని వల్ల చర్మంపై బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ కారణంగా మొఖంపై మొటిమలు ఏర్పడతాయి.

ఒత్తిడి ఎక్కువైతే సోరియాసిస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  చర్మంపై దద్దుర్లు, తామర వచ్చే అవకాశం కూడా ఉంది.

చర్మం ఎర్రబడటం, చర్మం దురద పుట్టడం, ఎరుపెక్కడం, పగుళ్లు ఏర్పడటం, చర్మం గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

ఒత్తిడి ఎక్కువైతే చర్మంపై బొబ్బలు కూడా వస్తాయని అంటున్నారు.

ఒత్తిడి ఎక్కువైతే రోసేసియా అనే చర్మ సమస్య వస్తుంది. దీని వల్ల ముఖంలో రక్తనాళాలు ఎర్రబడతాయి. చిన్న మొటిమలను పుట్టిస్తుంది.

నిద్రలేమి సమస్య వల్ల కూడా చర్మంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల నిద్ర సరిగా పట్టదు.

దీని వల్ల అలసట, చిరాకు పెరుగుతుంది. ఇవి ఒత్తిడి పెరిగేందుకు కారణమవుతాయి.

నిద్రలేమి వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడడమే కాకుండా.. చర్మం ముడతలు పడే అవకాశం ఉంది.

అందుకే ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయాయం, ధ్యానం, యోగా వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా చెప్పబడింది. దీని గురించి పూర్తి అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.