మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా నేటి కాలంలో చిన్న వయసులోనే చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.
మరీ ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు.
ఇలాంటి అనారోగ్య సమస్యలను నుంచి బయట పడేందుకు ఎన్నోరకాల మందులు వాడడంతో పాటు వ్యాయామాలు కూడా చేస్తుంటారు.
ప్రధానంగా చాలా మంది మధుమేహ వ్యాధితో బాధపడుతూ దీనికి తగ్గ జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటిస్తుంటారు.
అయితే మధుమేహంతో బాధపడుతున్న చాలా మంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్య నిపుణులు ఏం చేబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చాలా మంది అంటుంటారు. అయితే ఉల్లిపాయలు లేని కూరలు ఉండవనే చెప్పాలి.
అయితే మధుమేహంతో బాధపడేవారు ఉల్లిపాయలు తీసుకుంటే చక్కెర స్థాయిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఖనిజాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు చక్కెర స్థాయిని తగ్గించేందుకు ఉల్లి దోహదపడుతుంది.
ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ ను తగ్గించేందుకు సహయపడతాయి.
మన శరీరానికి కావాల్సిన బాక్టీరియా ఉల్లిపాయలో పుష్కలంగా ఉంటాయి. చక్కెర స్థాయిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ సులభతరం చేయడంతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉండడానికి ఉల్లిపాయ దోహదపడుతుంది.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. ఉల్లిపాయలో పిండి పదార్థం ఉండదని, వీటిని రోజుకు మూడు పూటల తీసుకుంటే చక్కెర స్థాయిని తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుందని తెలిపింది.
ఉల్లిపాయలో క్విర్సిటిన్ అనే ప్లెవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ లక్షణాలను తగ్గించేందుకు సహయపడతాయని ఎన్నో అధ్యయనాల్లో బయటపడింది.