నెయ్యి తీసుకోవడంపై ఇప్పటికీ ఎంతో మందికి అనేక రకాల అపోహలు ఉన్నాయి.
కొంతమంది నెయ్యిని తీసుకోవడం మంచిది కాదని కొందరు అంటుంటే..
నెయ్యి తీసుకోవడం చాలా లాభాలు ఉన్నాయని మరి కొందరు అంటున్నారు.
ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ఉచిత సలహాలు ఇస్తుంటారు.
నెయ్యి తీసుకోవడంలో అసలు నిపుణులు ఏం చెబుతున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి వేడి అన్నంలో కొద్దిగా అవకాయం, మరి కొంచెం నెయ్యి కలుపుకుని తింటుంటే.. అబ్బా.. ఆ రుచి వేరనే చెప్పాలి.
ఎన్నో గుణాలు కలిగి ఉన్న ఇలాంటి నెయ్యిని తీసుకోవడంపై మాత్రం చాలా మందికి అపొహలు ఉన్నాయి.
నెయ్యిలో అత్యవసరమైన అమైనో అమ్లాలు ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల మన రక్తనాళ్లలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
నెయ్యిలో ఉన్న ప్యాటి యాసిడ్స్ వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి సహాయడుతుంది.
నెయ్యిలో ఉండే యాంటి ఫంగల్, యాంటి వైరస్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తాయి.
ఇదే కాకుండా కంటి సంబంధమైన అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
ప్రతీ రోజు నెయ్యి తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత, గ్యాస్, ఎసిడిటి, గుండెపోటు వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.
అయితే నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందనేది మాత్రం పూర్తిగా అవాస్తవమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
రోజు తగిన మోతాదులో నెయ్యిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
నోట్: పై విషయాలు పాటించేముందు మీ దగ్గరలోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.