ఉదయాన్నే కప్పు కాఫీ తాగనిదే ఏ పనీ మెుదలు పెట్టరు చాలా మంది.
ఇక కప్పులకు కప్పులు టీ తాగేవారు కూడా ఉంటారు.
అయితే మార్కెట్ లోకి చాలా రకాల కాఫీలు అందుబాటులోకి వచ్చాయి.
దాంతో ఏ కాఫీ తాగితే మంచిది అన్న సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి.
అదీకాక నిపుణులు చెబుతున్న ప్రకారం బ్లాక్ కాఫీ తాగితే నిజంగా బరువుతగ్గుతారా? అన్న అనుమానం చాలా మందిలో ఉంది.
మరి బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గుతారో లేదో, అసలు అధ్యాయనాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన అధ్యయనంలో రోజుకు 4 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు నాలుగు శాతం తగ్గుతుందని తేలింది.
ముఖ్యంగా బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ శరీరం యెుక్క అధిక బరువును తగ్గించడానికి సహయపడుతుందని వారు చెబుతున్నారు.
ఈ యాసిడ్ శరీరంలోని గ్లూకోజ్ ఉత్పత్తిని ఆలస్యం చేస్తుంది.
ఇది కొత్త కొవ్వు కణాలను ఉత్పత్తికాకుండా నిరోధిస్తుంది.
ఇక ఇందులో ఉండే కెఫిన్ మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
బ్లాక్ కాఫీ ముఖ్యంగా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి తొడ్పడుతుందని అధ్యయనంలో తేలింది.
బ్లాక్ కాఫీ బాడీ నుంచి అదనపు నీటిని తొలగించడానికి అద్భుతంగా సహయపడుతుంది.
నోట్: ఈ చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న నిపుణుల, వైద్యుల సలహాలు పాటించండి.